నేటి సాక్షి, కమలాపూర్: పట్టుదలతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని వెన్నంపల్లి మనోజ్‌కుమార్ నిరూపించాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల పరిధిలోని కన్నూర్ గ్రామానికి చెందిన వెన్నంపల్లి శంకరయ్యకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఈ ముగ్గురిలో గతంలోనే ఇద్దరూ ఉద్యోగాలు సాధించి గ్రామానికి, కన్న తల్లిదండ్రులకు పేరు తీసుకొచ్చారు. చిన్న కొడుకు మనోజ్‌కుమార్ ఏకంగా నాలుగు ఉద్యోగాలు సాధించి, గ్రామ కీర్తిని మరింత ఇనుమడిపంజేశాడు. నెల రోజుల క్రితం గ్రూప్–4 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాలు సాధించాడు. ఈ నెల 4 న ఆదివారం వెలువడిన ఫలితాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా విజయం సాధించాడు. ఈ సందర్భంగా మనోజ్‌కుమార్ మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారం, ఇష్టంతో కష్టపడి చదివితే సాధించనిది ఏదీ లేదని అన్నారు. తనకు నచ్చిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా విధుల్లో చేరుతానని అన్నారు. తల్లిదండ్రులు ఆనందంతో మురిసిపోతున్నారు. గ్రామ ప్రజలు మిత్రులు అభినందనలు తెలిపారు.

