Saturday, March 14, 2026

గుర్తు తెలియని వాహనం ఢీ ఒకరు మృతి

నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్) : మండలంలోని ఖాసీంపేట గ్రామ సమీపంలోని కట్టే మిషన్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో (గన్నేరువరం)మారెళ్ళకుంటకు చెందిన ఏలేటి జలపతి రెడ్డి 60 సం, అనే వ్యక్తి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. రహదారి వెంట నడుచుకుంటూ వెళుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. అటు నుంచి వెళుతున్న స్థానికులు గమనించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ లో సంఘటన ప్రదేశానికి చేరుకొని చికిత్స నిమిత్తం కరీంనగర్ లో ని ఒక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు గత కొద్దికాలంలో ఖాసీంపేట సంపు వద్ద నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది. మృతుడికి భార్య పిల్లలు ఉండగా ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తాండ్ర నరేష్ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News