
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : చుక్కా రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన 15 వ సైన్స్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ 2024-25 లో ఆర్బిట్ ఇ టెక్నో పాఠశాల విద్యార్థులు తమ అత్యుత్తమ ప్రతిభతో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులలో 6 వ తరగతికి చెందిన ఎం. పవన్ స్టేట్ లెవెల్ మొదటి ర్యాంకు, 10వ తరగతికి చెందిన టి. సంజన రెడ్డి స్టేట్ లెవెల్ రెండవ ర్యాంకు 9 వ తరగతి కి చెందిన కె. అశ్విత్ రెడ్డి, స్టేట్ లెవెల్ మూడవ ర్యాంకు, 6వ తరగతికి చెందిన జి. రేవంత్, నాలుగవ రాంక్ , 8వ తరగతికి చెందిన జి. నాగ శివాని, ఐదవ ర్యాంకు 10వ తరగతికి చెందిన పి. నిహారిక, ఐదవ ర్యాంకు 5వ తరగతి కి చెందిన టి. ఆర్. సుచిత 8వ ర్యాంకు, 7వ తరగతి కి చెందిన కె. అజయ్ కుమార్ కు 9 వ ర్యాంకు 8వ తరగతికి చెందిన ఎం. సహస్ర 9 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. ఈ నెల ఫిబ్రవరి 23 వ తేదీన ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జరిగిన సి ఎల్ బి బహుమతుల ప్రధానోత్సవంలో ప్రొఫెసర్ శ్రీ ఆర్కే మిశ్రా (ఫార్మర్ డైరెక్టర్) ఐ.పి.ఇ. ఎస్ కళ్యాణ్ దత్ (ఐ ఐ టి ఢిల్లి ఏ ఐ యు) లెక్చరర్ ఇన్ ఫిజిక్స్), మరియు ఎస్. చరణ్ కౌశిక్ యాదవ్ (జనరల్ సెక్రెటరీ, ఏఐసిసి) వై.ఎస్ శర్మ (డైరెక్టర్ జి. ఈ. ఐ) ప్రొఫెసర్ విజయలక్ష్మి (శివ శివాని ఇంటర్నేషనల్ కాలేజ్ ఆఫ్ బిజినెస్) డాక్టర్ శ్యాం ప్రసాద్ (స్పీకర్) మరియు యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ల చేతుల మీదుగా 1 వ ర్యాంకు సాధించిన ఎం. పవన్ (6 వ తరగతి) 5116 రూపాయలు, రెండవ ర్యాంకు సాధించిన టి. సంజన (10 వ తరగతి) 3116 రూపాయలు, మూడవ ర్యాంకు సాధించిన కె. అశ్విత్ రెడ్డి (9వ తరగతి) వారికి 2116 రూపాయలతో పాటు మెమొంటో, సర్టిఫికెట్లు మరియు మిగిలిన విద్యార్థులకు కూడా మెమెంటోల తో పాటు సర్టిఫికెట్లు బహుమతిగా ఇచ్చారన్నారు. స్టేట్ లెవెల్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ చిట్టి రెడ్డి భగవాన్ రెడ్డి మరియు పాఠశాల డైరెక్టర్ హారిక రెడ్డి అభినందించారు.





