Sunday, March 15, 2026

మా నెయ్యిలో హానికర పదార్థాలు లేవు

-ఫుడ్ సేఫ్టీ అధికారుల క్లీన్ చీట్
-పుడ్ సేఫ్టీ నిబంధనలకు లోబడే నెయ్యి తయారీ

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు) :
హుజురాబాద్ పట్టణంలో తయారయ్యే అనూష్ నెయ్యిలో కల్తీలేదని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు తేల్చి చెప్పారు. హుజురాబాద్ లో తయారయ్యే అనూష్ నెయ్యి కేంద్రాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల తనిఖీ చేసి శాంపిల్స్ తీసుకొని ల్యాబ్ కు పంపించారని నిర్వాహకుడు సోమవారం తెలిపారు. అన్ని పరీక్షల అనంతరం నెయ్యిలో ఎటువంటి హానికర పదార్థాలు లేవని, హానికర ఫుడ్ కలర్ వినియోగించలేదని, ఫుడ్ సెఫ్టీ నిబంధనలకు లోబడే నెయ్యి తయారీ జరుగుతున్నట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ సందర్భంగా అనూష్ నెయ్యి యజమాని నాగేశ్వర్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. గత ముప్పై సంవత్సరాలుగా వినియోగదారులకు నాణ్యమైన నెయ్యి అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి నిజాయితీగా నెయ్యి తయారు చేస్తూ వినియోగదారులకు సరసమైన ధరలలో విక్రయిస్తున్న అనూష్ నెయ్యిపై గిట్టని వారు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. ఇంకోసారి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నాగేశ్వరావు హెచ్చరించారు. ఇప్పటికైనా కొందరు తమ నెయ్యి పై దుష్ప్రచారం మానుకోవాలని నాగేశ్వరరావు హితవు పలికారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News