Friday, April 3, 2026

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి…!!!

  • ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిఒక్కరు క్రమంతప్పకుండా సమయం దొరికినప్పుడల్లా వాకింగ్, రన్నింగ్, యోగ చేయాలి
  • 40 సంవత్సరాల పైబడిన వారు 6 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
  • పోలీసులు ఆరోగ్యంగా ఉంటేనే విధులు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు
  • వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్న జిల్లా ఎస్పీ దంపతులు
  • వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్
  • వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఐఏఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
గురువారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ మలక్ పేట్ హైదరాబాద్ జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్,ఆదర్శ్ సురభి, ఐఏఎస్, వనపర్తి ఎమ్మెల్యే, తూడిమేగారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్,తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి అపర్ణ తో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో జిల్లా ఎస్పీ శ్రీ రావుల గిరిధర్ ఐపిఎస్ వారి సతీమణి శ్రీమతి అపర్ణ స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు వైద్య శిబిరంలో ఉన్నత అధికారి నుండి హోంగార్డ్స్ వరకు ఈసీజీ, బిపి, షుగర్ పరీక్ష, పల్స్ రేట్, 2డి ఎకో, కంటి, ఎక్సరే, 252 రకాల రక్త పరీక్షలు వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు మాట్లాడుతూ..శాంతిభద్రతలు కాపాడడం కోసం పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉండి శ్రమిస్తారని, వారికి ఆరోగ్యం కూడా ఎంతో ప్రధానమని చెప్పారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది నిత్యం వ్యాయామం చేస్తూ ఎలాంటి రోగాలు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. జిల్లా కలెక్టర్ కూడా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యా వైద్యంపై ప్రధాన దృష్టి సారించారని కొనియాడారు. అడిగిన వెంటనే వైద్య రంగానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారని చెప్పారు. వనపర్తి జీజీహెచ్ కు, ఎంసిహెచ్ కు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వనపర్తి నియోజకవర్గం లోని పెబ్బేరు కు 30 పడకల ఆసుపత్రి, వనపర్తి లో 500 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులది కీలక పాత్ర అని, కాబట్టి పోలీసులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి లేదా కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా మనకి ఏవైనా రోగాలు వచ్చే అవకాశం ఉంటే ముందుగానే తెలుసుకొని జాగ్రత్త చర్యలు తీసుకోగలుగుతామని చెప్పారు.జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగా మిషన్ మధుమేహ, టీబీ వంటి కార్యక్రమాలతో ప్రజలందరికీ పరీక్షలు చేసి వాటిపై ముందస్తుగా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శభిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుఅధికారులు, సిబ్బంది ఎల్లప్పుడు విధినిర్వహణలో ఉండటం వలన తమ ఆరోగ్యం పట్టించు కోకపోవడంతో ఎన్నోరకాలఅనారోగ్యాలకు గురవుతున్నారని ఆరోగ్యంపై అవగాహన ఎంతో ముఖ్యమని, సిబ్బంది యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు దినచర్య, జీవన విధానం మిగతావారితో పూర్తి భిన్నంగా ఉంటుందని, ఇందుకుగానూ మన ఆరోగ్య పరిరక్షణకై ప్రత్యేక చర్యలు తీసుకొనక తప్పదని అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు నడక, వ్యాయామం, యోగ వంటివి మన దినచర్యలో భాగం చేసుకోవాలని. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని వ్యాధుల బారిన పడకుండా బారినపడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదని మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాలలో కల్తీ ఉంటుందని జాగ్రత్తగా తీసుకోవాలని సూచించారు కొన్ని వ్యాధులకు గతంలో వైద్యం అందుబాటులో ఉండేది కాదని ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో కలవని ప్రత్యేకంగా మనకు అందుబాటులో గల ఆరోగ్యభద్రతను సద్వినియోగం చేసుకోవాలని 40 సంవత్సరాలు పైబడిన ప్రతిఒక్కరు ప్రతిఆరు నెలలకు ఒకసారైనా మన ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించి మందులు వాడే దానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని సూచించారు. జిల్లా కలెక్టర్ కూడా జిల్లాలో పోలీసు శాఖ బలోపేతానికి ఎంతో సహకారం అందిస్తున్నారని కొనియాడారు. ఏఆర్ విభాగానికి సంబంధించిన హెడ్ క్వార్టర్ నిర్మాణానికి అడిగిన వెంటనే రూ. 10 లక్షలు మంజూరు చేశారని, అదేవిధంగా డిఎస్పి భవనానికి కూడా సహకారం అందించారని తెలిపారు. జిల్లాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి కూడా కలెక్టర్, ఎమ్మెల్యే సహకరిస్తున్నారని చెప్పారు. అందరం కలిసికట్టుగా పని చేస్తే ఏదైనా సాధించగలమని ఎస్పీ పేర్కొన్నారు.జనరల్ ఫిజీషియన్, ఆర్థోపెడిక్, గైనిక్, కార్డియాలాజి, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఆప్తమాలజీ పీడియాట్రిషన్, డెంటల్, లో అనుభవజ్ఞులైన డాక్టర్లచే పోలీసు అధికారులకు, సిబ్బందికి మరియు వారి కుటుంబ సభ్యులకు బీపీ, షుగర్, ఈసీజీ, 2డీఈకో,రక్త పరీక్షలు, వైద్యపరీక్షలు వైద్య సేవలు అందించిన డాక్టర్లకు, మరియు ముఖ్యంగా వైద్య శిబిరాన్ని నిర్వహించడంలో ఉదారత చూపిన యశోద ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ డాక్టర్లను ఎస్పీ శాలువతో సన్మానించారు. పోలీసుఅధికారులు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు కలిసి మొత్తం 750 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పోలీసుఅధికారులు, సిబ్బంది ఆరోగ్యం మరియు సంక్షేమం పట్ల ఎస్పీ తీసుకుంటున్న శ్రద్ధ విశేషమైనదని, ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు పోలీసు అధికారులు సిబ్బంది ఎస్పీ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సాయుధ దళ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, వనపర్తి ఇంచార్జ్ అదనపు ఎస్పీ, ఉమామహేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి అపర్ణ, వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి, శ్రీనివాసులు, వనపర్తి సిఐ, కృష్ణ,కొత్తకోట సిఐ, రాంబాబు, ఆత్మకూరు సిఐ, శివకుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు,అప్పలనాయుడు, శ్రీనివాస్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు, డాక్టర్ పిజె, బాబు, డాక్టర్ ఇంద్రనీల్, యశోద హాస్పిటల్ మలక్ పేట్, అసిస్టెంట్ మేనేజర్, శివకుమార్, వైద్యులు మరియు వైద్యసిబ్బంది వనపర్తి జిల్లా వైద్య సిబ్బంది, జిల్లాలోని పోలీసు అధికారులు,సిబ్బంది,హోంగార్డు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు, పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News