Wednesday, March 18, 2026

ఏపీఎండిసి సంస్థ నందు పనిచేస్తున్న అవుట్సోర్స్ & ట్రైనింగ్, కార్మికులను రెగ్యులర్ చేయాలి

  • లేని పక్షంలో పోరాటాలకు సిద్ధం
  • సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు  పిలుపు

నేటి సాక్షి,అన్నమయ్య జిల్లా, ప్రతినిధి భక్త కుమార్ : ఏపీఎండిసీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం,జనరల్ బాడీ సమావేశం, ఆదివారం రైల్వే కోడూర్ ఎన్జీవో హోం లో, కుప్పాల సుబ్రహ్మణ్యం, అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. యూనియన్ గౌరవాధ్యక్షులు,   సిఐటియు జిల్లాఅధ్యక్షులు, సిహెచ్ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఏ.రామాంజులు ముఖ్య అతిథులుగా పాల్గొని, మాట్లాడుతూ, ఏపీఎండిసి సంస్థలో 15 సంవత్సరాలు గా పనిచేస్తున్న అవుట్ సోర్స్& ట్రైనింగ్, పేరుతో వారి శ్రమను యాజమాన్యం వారు దోపిడీ చేస్తున్నారని, కార్మికులందరూ ఐక్యమై రెగ్యులర్ కోసం, పోరాటం చేయాలని, పిలుపునిచ్చారు. మొదటినుంచి, సిఐటియు,  ఏపీఎండీసీ సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగానూ, కార్మికుల హక్కుల కోసం, రాజీలేని పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. బయర్స్ గతంలో సిండికేట్ అయి బెరైటీస్ ధర తగ్గించినప్పుడు సీఐటీయూ కార్మిక సంఘం పోరాటం  చేసిన విషయం గుర్తు చేశారు.  రెగ్యులర్ కార్మికుల ప్రమోషన్ కోసం, సెంట్రల్   మినిమంవేజ్ పెంపు కోసం,   ప్రాఫిట్ షేర్, 30% ప్రాజెక్ట్ అలవెన్స్, సమాన పనికి సమాన వేతనం, సాధించడంలో, కీలకపాత్ర పోషించినట్లు తెలిపారు.  నీతి నిజాయితీగా, పని చేస్తున్న సంఘం, సిఐటియు, అని చెప్పారు.  యాజమాన్యం వారు కార్మిక హక్కులను కాలరాస్తూ, కార్మిక వర్గాన్ని అనగదొక్కాలని చూడడం చాలా బాధాకరం, కార్మికులు అనేక సంవత్సరాలు పోరాడి సాధించుకున్న గిఫ్ట్ అమౌంట్ ను నేటికి ఇవ్వకుండా కార్మికులను ఇబ్బంది పెట్టడం న్యాయం కాదు అని తెలిపార కార్మికులను, కార్మిక నాయకులను, ఇబ్బందులకు గురి చేస్తే, ఐక్యంగా, జిల్లా వ్యాప్తంగా, పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏపీఎండిసీ అవుట్ సోర్స్ పోరాట కమిటీ జేఏసీ కన్వీనర్ ఆర్ వెంకటేష్ మాట్లాడుతూ, కార్మిక చట్టాలు, కేంద్ర ప్రభుత్వాలు, పెట్టుబడుదారులకు, అనుకూలంగా మారుస్తున్నారని, 8 గంటల పనిని, 12 గంటలకు పెంచడం,29 కార్మిక చట్టాలని మార్చి పెట్టుబడి దార్లకు మేలు చెయ్యాలని చూడడం బాధాకరం అన్నారు, స్వాతంత్ర్యం ముందు నుండి కార్మిక వర్గం సాధించుకున్న చట్టాలను యథాతతంగా కొనసాగించి కార్మికుల హక్కులను కాపాడాలని తెలిపారు, ఏపీఎండీసీ సంస్థలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో, సిఐటియు మండల కార్యదర్శి  పి.జాన్ ప్రసాద్, కెవిపిఎస్, జిల్లా కన్వీనర్,  ఓబిలి పెంచలయ్య, ఐకెపి వివో, సంగం మండల నాయకులు, నగరపా టి ఆనంద్ , వీఆర్ఏ సంఘం, లక్ష్మీకర్, యూనియన్ నాయకులు, నారద సుబ్బరాయుడు, ఎం శ్రీనివాసులు, ఎం వెంకటేశు, మర్రి శంకరయ్య,  యు.వెంకటరమణ, గల్లా చలపతి,   రహంతుల్లా, సుబ్బరాయుడు, డప్పు శివప్రసాద్, హరి, అరుణావతి, సరస్వతి, సుభాషిని, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News