- బెల్లంపల్లి రూరల్ సిఐ సయ్యద్ అఫ్జలూద్దీన్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– త్వరలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా మంచిగా పరీక్ష రాసి, మంచి మార్కులు సాధించాలని జిల్లాలోని బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలూద్దీన్ సూచించారు. శనివారం ఆయన బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పరిధిలోని నెన్నెల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ముందుగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ బూత్ ను సందర్శించి, పలు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నెన్నెల ఎస్ఐ ప్రసాద్, పోలీస్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.





