Wednesday, March 11, 2026

పాడి కౌశిక్ రెడ్డి …కాదు కాదు… పాడు కౌశిక్ రెడ్డి

మాజీ ఎంపిటిసి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాసాలా రామస్వామి

నేటిసాక్షి, జమ్మికుంట :
హుజురాబాద్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాడి.. కాదు కాదు పాడు కౌశిక్ రెడ్డి.. అని మాట్లాడిన వాసాల రామస్వామి, కాంగ్రెస్ నాయకులు..ఎక్స్ ఎంపిటిసి. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి చేస్తున్న చర్యలను చూస్తే హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు తలదించుకునే పరిస్థితి వస్తుంది అన్నారు. ఈ పాడు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి హుజురాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టినప్పుడు అందులో తాను కూడా ఒక డైరెక్టర్ నని, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తాను కలెక్టర్తో అందరం కూర్చొని దళిత బంధును పైలట్ ప్రాజెక్టు కింద దళితులకు అందించడం జరిగింది అన్నారు. మొన్న వచ్చినటువంటి ఎలక్షన్లో కౌశిక్ రెడ్డికి ఓట్లు పడతయో పడేయో అని ఏకైక ఉద్దేశం కొద్దీ అప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఈడీని సెలవులలో పంపించి ఈ దళిత బందును సెకండ్ విడత ఆపించింది నువ్వు కాదా కౌశిక్ రెడ్డి అని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో నీ పాత్ర టిఆర్ఎస్ ఎదుగుదలలో, రాష్ట్ర అభివృద్ధిలో నీ పాత్ర ఏంటి కౌశిక్ రెడ్డి, అని మండిపడ్డారు. ఈ దళిత బందు పైలెట్ ప్రాజెక్టు అనేది ఈటల రాజీనామా వల్ల మాత్రమే వచ్చింది అని, ఈ హుజురాబాద్ దళిత ప్రజలకు దళిత బంధు అనే పథకం వచ్చింది అన్నారు. ఈ దళిత బంధు పథకాన్ని అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎలాంటి షరతులు లేకుండా ఇంప్లిమెంట్ చేస్తుంటే కౌశిక్ రెడ్డి తన స్వార్థం కోసం ఈ దళిత బందును ఆపుదల చేయించి, అప్పుడున్నటువంటి ఎన్నికలలో నేను చచ్చిపోతా అని బ్లాక్మెయిల్ చేసి, ఓట్లు వేయించుకుంది నువ్వు కాదా కౌశిక్ రెడ్డి అని పేర్కొన్నారు. కానీ నువ్వు చేస్తున్నది ఏంటి కౌశిక్ రెడ్డి.. హుజురాబాద్ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేస్తున్నావ్ అని మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ముగ్గురు మంత్రులు ముగ్గురు కలెక్టర్ల ఆధ్వర్యంలో అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరుగుతుంటే అందులో నీ ప్రజలకు నీ ప్రాంతానికి నియోజకవర్గానికి ఏమి కావాలో అడగకుండా జిల్లా కేంద్రం నడి ఒడ్డున హుజురాబాద్ పరువు తీసి, హుజురాబాద్ అస్తిత్వాన్ని దెబ్బ కొడుతున్నావ్.. అన్నారు. ఆ రోజున తెలంగాణ ఉద్యమకారులను ప్రజలను కొట్టిన చరిత్ర నీది కాదా అని ప్చారశ్రునించారు. దళితుల మీద ప్రేమే ఉంటే, నువ్వు కూడా రాజీనామా చెయ్, రెండో విడత దళిత బంధు వస్తుంది, అని వివరించారు. ఒకవేళ రాకపోతే కాంగ్రెస్ కార్యకర్తలుగా ముఖ్యమంత్రి ఇంటిముందు ధర్నా చేస్తామని, దళిత బంధు వచ్చేదాకా పోరాడుతామని అన్నారు. హుజురాబాద్ లో చిన్న పిల్లవాడు కూడా నిన్ను చూస్తే, నవ్వుకునే పరిస్థితి వచ్చింది కౌశిక్ రెడ్డి అని అన్నారు. పిచ్చి లేసినట్టుగా, ఆగమాగం చేస్తున్నావు అని మండిపడ్డారు. దళిత ప్రజలారా,దళిత సోదరులారా, ఆలోచించండి, ప్రజల మీద ప్రేమ లేని కౌశిక్ రెడ్డి తో తిరగకండి, ప్రజల మీద నిజమైన ప్రేమే ఉంటే, ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తే వచ్చిన అభివృద్ధి నిధులు, మన దళిత బంధు, మళ్లీ కౌశిక్ రెడ్డి రాజీనామాతో సెకండ్ విడత దళిత బంధు నియోజకవర్గ అభివృద్ధి కి చాలా నిధులు వస్తాయన్నారు. కౌశిక్ రెడ్డి దళితుల పట్ల హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పట్ల హుజురాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఉద్దేశమే గనుక నీకు ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో.. వాసాల రామస్వామి తో పాటు కాంగ్రెస్ నాయకులు చిలివేరి రాజమౌళి, మేక మల్ల వెంకటేష్, రాచపల్లి సాగర్, రాచపల్లి గణేష్, కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News