- గద్దర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బండి సంజయ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి.
- గద్దర్ ను విమర్శించడం తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చడమే.
- గంజిపేట రాజు
- బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా యువ నాయకులు
నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్, రమేష్ : ఈసందర్భంగా గంజిపేట రాజు మాట్లాడుతూ..పద్మ అవార్డులు బీజేపీ అవార్డులు కావని,అవి జాతీయ అవార్డులని గంజిపేట రాజు మాట్లాడుతూ అన్నారు. పద్మశ్రీ అవార్డులలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని, అవార్డుల ప్రకటనలో ఫెడరల్ స్పూర్తి లోపించిందని అన్నారు. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజా యుద్ధ నౌక గద్దర్ ను అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ వెనక్కి తీసుకుని భేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. సాహిత్య కళారూపం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా ప్రజలను చైతన్య పరుస్తూ పోరాడిన యుద్ద నౌక గద్దర్ పై అర్థరహితంగా బండ్ సంజయ్ మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. బీజేపీ నేతలను హత్య చేయించిన గద్దర్ కు అవార్డ్ ఇవ్వాలా అంటూ నిరాధార ఆరోపణలు చేస్తూ మీడియా సాక్షిగా మాట్లాడిన సంజయ్ కేంద్ర మంత్రిగా ఉంటూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీజేపీ చరిత్ర దేశ ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు.వాస్తవానికి బీజేపీ ది హత్యారాజకీయాల చరిత్ర అని వారు ఎద్దేవా చేశారు. దేశంలో హిందూత్వం పేరుతో అణగారిన వర్గాల ప్రజలను గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో మారణహోమం చేసిన బీజేపీ ఈ దేశానికి ప్రమాదమని వారు ఉద్ఘాటించారు. దేశ స్వాతంత్య్రం లో బీజేపీ పాత్ర లేదని, దేశంలో జరిగిన ఏ పోరాటంలో బీజేపీ పాత్ర లేకున్నా చరిత్రను వక్రీకరించడంలో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తూ దేశంలో మత అజెండాను అవలంభిస్తున్నారని అన్నారు. అందుకే బండి సంజయ్ బహిరంగంగా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
జాతీయ అవార్డులైన పద్మ అవార్డులను దేశంలో వివిధ రంగాలలో సేవ చేసిన వారికి అవకాశం కల్పించాలని, కానీ రాజకీయంగా చూడకూడదని అన్నారు.కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో చూపిన విధంగానే పద్మ అవార్డుల ప్రకటనలో కూడా విపక్ష చూపిందని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజాయుద్ధ నౌక గద్దర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జానపద కళలు, సాహిత్య రంగంలో చేసిన సేవలకు గుర్తుగా గద్దర్ కు పద్మ అవార్డును ప్రకటించాల్సి ఉండెనని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గద్దర్ పాటలు ప్రజలను ఉర్రూతలూగించాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా పద్మ అవార్డుల విషయంలో తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.





