తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రామ శ్రీనివాస్ వర్ధంతి.
- సమాజ శ్రేయస్సు కోసం పద్మశాలిల పాత్ర మరువలేనిది.
- బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్.
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు రామ శ్రీనివాస్ గారి ప్రధమ వర్ధంతి ఈరోజు హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రామా శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ ఏర్పాటుకు రామా శ్రీనివాస్ చేసిన కృషి మరిచిపోలేనివని, పేద ప్రజల కోసం రామ శ్రీనివాస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని నిరంతరం ప్రజల కోసం పరితపించే వ్యక్తి నేడు లేకపోవడం సమాజానికి తీరని లోటని అన్నారు, సమాజ శ్రేయస్సు కోసం పద్మశాలిల పాత్ర ఏనలేనిదని ప్రతి ఉద్యమంలో ప్రతి పోరాటంలో పద్మశాలిల భాగస్వామ్యం ఉన్నదని పద్మశాలీలం ఐక్యంగా ఉండి రానున్న రోజుల్లో సమాజ శ్రేయస్ కోసం పద్మశాలి సమాజం నుంచి పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ, నల్ల నరసింహులు, సుద్దాల హనుమంతు, ఆలే నరేంద్ర, సిరిపురం యాదయ్య వంటి వారి స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు అడిచెర్ల శ్రీనివాస్, చిలుక మారి శ్రీనివాస్, సంగం సత్యనారాయణ, జడల చిరంజీవి, ఇప్పకాయల సాగర్, కూరపాటి రామచంద్రం, గుండేటి దేవయ్య, వేముల యాదగిరి, రాజేందర్, కోక్కుల అశోక్, ఎనగందుల వెంకన్న, సంగం శ్రీనివాస్, అడిచర్ల సంపత్, మంద బిక్షపతి, సంఘం శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.





