Friday, April 3, 2026

కేజీబీవీ హాస్టల్లో ఫ్యాడ్లు, పెన్నులు పదవ తరగతి విద్యార్థులకు పంపిణీ

  • బి. మహేందర్ నాయు బిసి పొలిటికల్ జేఏసీ మండల అధ్యక్షులు

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : మదనాపురం మండల కేంద్రంలో కేజీబీవీ హాస్టల్లో విద్యార్థులకు పెన్నులు ఫ్యాన్లు పంపిణీ చేశారు. మహేందర్ నాయుడు మాట్లాడుతూ ప్రవేట్ పాఠశాల కన్నా మెరుగైన విద్య అందిస్తున్నారని ఇక్కడ టీచర్స్ మంచి విద్య బోధన అందిస్తున్నారని టీచర్స్ అందరిని అభినందించారు. ఆహ్లాద వాతావరణం ఉండటం చాలా సంతోషకరమన్నారు. ఉత్తీర్ణత సాధించాలని హాస్టల్ కు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు తెలియజేశారు.హాస్టలో ఎన్నో సమస్యల మా దృష్టికి వస్తే బిసి పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించే విధంగా పోరాటాలు చేశాము, అదేవిధంగా ముందు ముందు ఏ కార్యక్రమాలు గాని చేయటానికి బిసి పొలిటికల్ జేఏసీ ముందు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎ. బాలరాజ్, షేక్ అశోక్, చంద్రశేఖర్,రాజ వర్ధన్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News