Wednesday, March 25, 2026

కాల్వ సుజాత, కోలేటి దామోదర్ చిత్రపటాలకు పాలాభిషేకం

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి వివేకానంద చౌరస్తాలో తెలంగాణ ఆర్యవైశ్య ముద్దుబిడ్డలు ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్మన్ కాలువ సుజాత, మాజీ పోలీస్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ చిత్రపటాలకు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ ఆర్యవైశ్య పేద కుటుంబాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల రమేష్ గుప్తా ఆద్వర్యంలో జరిపిన ఈ కార్యక్రమంలో పేద కుటుంబానికి చెందిన ఈగం లావణ్య రాజేందర్ కుటుంబానికి 25 కిలోల బియ్యం, వేయి రూపాయల నగదు అందించడం జరిగింది. ఈ సందర్భంగా రమేష్ గుప్తా మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాల నుండి మా పేద ఆర్యవైశ్యులను ఎవరు గుర్తించలేదని, మా తెలంగాణ ఆర్యవైశ్య ముద్దుబిడ్డలు కాలువ సుజాతక్క, కోలేటి దామోదరన్న సహకారంతో మా పేద వైశ్యులకు హైదరాబాదు ఉప్పల్ బాగాయతులో ఐదు ఎకరాలు సుమారు 100 కోట్ల పైన విలువ చేసే భూమిని పేద వైశ్యుల కోసం తీసుకురావడంలో వారు చేసిన కృషి అభినందనీయమని, ఈ భూమిలో పేద వైశ్యులకు ఉపయోగపడే విద్యా, వైద్యం, ఉపాధి అందించే విధంగా చూడాలని, దీనికి సుజాతక్క పేద వైశ్యుల తరపున ముందుండి పోరాడాతూనే ఆర్య వైశ్య కార్పోరేషన్ కి నిధులు తీసుకురావాలని కోరారు. ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఒకప్పుడు పల్లెటూర్లలో ఆర్యవైశ్యులకు మాత్రమే కిరాణ షాపులు ఉండేవని, కానీ గత పది సంవత్సరాల నుండి వివిధ కులాల వారు కూడా షాపులు ఏర్పాటు చేస్తున్నందున వైశ్యులు ఉపాధి కోల్పోయి నిరుపేద వైశ్యులుగా మారుతున్నందున ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యాంసాని రమేష్ గుప్తా, రాయంచు సదాశివ్, కటకం భాస్కర్, రవి కిరణ్, గుంత సంతోష్, సిరంగి లక్ష్మణ్, చెట్ల మునీందర్, ముత్యం శ్రీనివాస్, కాసం చంద్రశేఖర్, ఈగం లావణ్య, రాజేందర్, ఇరుకుల్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News