Friday, March 20, 2026

ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ రవాణా అథారిటీ సభ్యులు పల్లిసతీష్ రెడ్డి

  • ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎస్.ఎ. సంపత్ కుమార్ ఆదేశాల మేరకు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా రవాణా అథారిటీ సభ్యుడిగా మానవపాడు మండలం నారాయణపురం గ్రామానికి చెందిన పల్లి సతీష్ రెడ్డి నియమింపబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలకు గాను వారిని గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం వారికి ఇట్టి గౌరవంతో సత్కరించింది గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఆర్ టి ఐ ఆఫీసులో ప్రమాణ స్వీకారం చేసిన సతీష్ రెడ్డి ఇట్టి అవకాశాన్ని జరివినియోగం చేసుకోకుండా రాష్ట్రంలో రోడ్డు భద్రత విషయంలో తన వంతు బాధ్యతలు నిర్వహిస్తానని రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకుంటానని ప్రభుత్వంలో జరిగే లోటుపాట్లను సవరించి మెరుగైన రోడ్డు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తానని గద్వాల్ జిల్లా లో రోడ్డు భద్రత పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని సతీష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు మాజీ జడ్పిటిసి మరియు తెలంగాణ టెలికాం డైరెక్టర్ ఇస్మాయిల్ మాజీ ఆర్ డి ఎస్ చైర్మన్ తనగల సీతారాం రెడ్డి, జోగులాంబ దేవాలయం డైరెక్టర్ జగన్ మోహన్ నాయుడు, అల్లంపూర్ మండల అధ్యక్షుడు అడ్డాకుల రాము, డీసీసీ జనరల్ సెక్రటరీ సిరాజ్, ఇటిక్యాల మండల అధ్యక్షులు రుక్మతు రెడ్డి, ఉండవెల్లి మండల అధ్యక్షులు గోపాల్, ఐజ మండల అధ్యక్షుడు జయన్న ఎర్రవల్లి మండల అధ్యక్షుడు వెంకటేష్ మానవపాడు పరమేష్ నారాయణపురం ఎస్ భాస్కర్ రెడ్డి ఎండి రఫీ రాజ్ కుమార్ వీరారెడ్డి లక్ష్మీ రెడ్డి గొల్ల వెంకట్ రాముడు నరేష్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News