Monday, March 16, 2026

పంచాయితీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల నిర్వహణ లో భాగంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు ఎంపిఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పంచాయితీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి అని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 317 గ్రామ పంచాయతీలు 11 మండలాలు, 2754 వార్డులు, 2754 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయని, ఇట్టి 317 గ్రామ పంచాయతీలకు జరగబోవు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో మొత్తం పురుషుల ఓట్లు 1,88,047 కు గాను స్త్రీల ఓట్లు 1,95,067 , ఇతరులు 10 ఉన్నారని, జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సెన్సిటీవ్, హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, గతంలో జరిగిన పొరపాట్లను పునరావృత్తం కాకుండా చూసుకోవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడమైనది. ఈ సమావేశములో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాలపై ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మాత్రమే సంబంధిత పథకాలకు అర్హులను ఎంపిక చేసి, సరైన నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించడమైనది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో సప్లమెంటరీ ఓటర్ లిస్టు ప్రకారంగా ఫైనల్ ఓటర్ లిస్ట్ అనుసరించి మ్యాపింగ్ చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడమైనది.
ఈ కార్యక్రమనికి జెడ్పి సీఈవో రాంరెడ్డి, డిపిఓ కల్పన, డి ఆర్ డి ఓ కౌసల్య దేవి, హౌసింగ్ పీడీ గణపతి మరియు సంబంధిత ఎంపీడీవోలు, ఎంపీవోలు, సంబంధిత మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News