నేటి సాక్షి, రామగిరి(కన్నూరి రాజు) :
పన్నూరు వాగు పై బ్రిడ్జి లేక వాగు అవతలి వైపు ఉన్న పొలాలకు మరియు మదన పోచమ్మ గుడికి వర్షాకాలంలో వాగుపై బ్రిడ్జి లేక పొలాల వెళ్లే రైతులు, గుడికి వెళ్లే భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయం పై తాజా మాజీ ఎంపీటీసీ చిందం మహేష్ తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్ధిళ్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించడంతో శుక్రవారం రామగిరి మండలం పన్నూర్ గ్రామం లో పంచాయతీరాజ్ ఏ.ఈ. వరలక్ష్మి, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ వాగు వద్దకు వచ్చి ఎస్టిమేషన్ కోసం మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది.