Wednesday, March 25, 2026

తబిత ఆశ్రమంలో పరికిపండ్ల నరహరి (IAS) జన్మదిన వేడుక

నేటి సాక్షి, గోదావరిఖని (రమేష్) : ఈరోజు స్థానిక తభిత ఆశ్రమంలో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రామగుండం ఇన్‌ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి అనంతరం చిన్నారులకి అన్నదానం చేశారు. సేవా కార్యక్రమంలో భాగంగా ఆశ్రమంలోని విద్యార్థులకు 10,000 విలువైన నిత్యావసర వస్తువులు క్వింటాళ్ల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి. మాట్లాడుతూ… పరికిపండ్ల నరహరి ఓ విధంగా యువతకు స్ఫూర్తి అన్నారు. ప్రజాసేవకు అంకితమై, ఉన్నత పదవుల్లోకి ఎదిగి, సమాజానికి సేవ చేయడంలో ఆదర్శంగా నిలుస్తున్నారు అని తెలియజేసారు. ఈ రోజు జన్మదినాన్ని పిల్లల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరుకోనీ మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని సందర్భంగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, బోడకుంటి సుభాష్, గుండబోయిన భూమయ్య. నాయకులు తోట కుమార శ్వామి, ఆలయ ఫౌండేషన్ సబ్యులు బొంకూరి మధు, తీట్ల రమేష్ బాబు, వెంకటేష్, కీర్తి నాగార్జున, లంక నరేష్, దూడపాక సుకుమార్, శనిగరపు శ్రీనివాస్, రాజ్ కుమార్, వెంకటేష్, సాగర్, చిలివెరు కుమార్ తదితరులు పాల్గోన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News