నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హనుమకొండ జిల్లా ఎయిడ్స్ ప్రివెన్షన్ మరియు నియంత్రణ సంస్థ, హనుమకొండ సంపూర్ణ సురక్ష కేంద్రం హన్మకొండ వారి ఆధ్వర్యంలో భాగస్వాముల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఐ ఎం ఏ హాల్ లో పిహెచ్‌సి, యూ పి హెచ్ సి, ఆర్.బి.ఎస్.కె వైద్యాధికారులు, ఎం ఎల్ హెచ్ పి లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ టి మదన్మోహన్ రావు అధ్యక్షత వహించగా ఇన్చార్జి డిఎంహెచ్ఓ డాక్టర్ బి. విజయకుమార్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయ కుమార్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ తో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల కృషితో హెచ్ఐవి గురించి ప్రజల్లో అవగాహన పెంపొందిందని అలాగే పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని అయినప్పటికీ ఇంకా చాలామంది పరీక్షలకు ముందుకు రావడానికి వెనుక బడుతున్నారని, వైద్యాధికారులు, సిబ్బంది హైరిస్కు గ్రూపుల నమ్మకాన్ని చూర గొనాలని, గోప్యత పాటిస్తూ వారికి భరోసా ఇవ్వాలన్నారు. ఐసీటీసీ కౌన్సిలర్లు, టి బి సూపర్వైజర్లు సమన్వయం తో పనిచేయాలని, టిబి, హెచ్ఐవి నిర్ధారణ గర్భిణీ స్త్రీలకు హెచ్ఐవి స్క్రీనింగ్, ఏ ఆర్ టి చికిత్స సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. హెచ్ఐవి పట్ల సమాజంలో ఉన్న అపోహలను తొలగించాలన్నారు. నిర్ధారణ తగిన చికిత్స మరియు ఫాలోప్ సేవలు అందించడం వల్ల మరణాలు రేటు చాలా వరకు తగ్గించ గలిగామన్నారు. అడిషనల్ డిఎంహెచ్‌ఓ డాక్టర్ టి మదన్ మోహన్ రావు మాట్లాడుతూ సంపూర్ణ సురక్ష కేంద్రం టి బి ఆసుపత్రి హనుమకొండ లో ఉందని దీని ద్వారా వైద్యాధికారులు, సిబ్బంది, ఎం ల్ హెచ్ పి లు, హెచ్ఐవి పరీక్షలు పెంచడంలో అలాగే అవగాహన కలిగించడం లో మరింత కృషి చేయాలని, అందరితో సమన్వయంతో పనిచేయాలన్నారు. టి బి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ సంపూర్ణ సురక్ష కేంద్రం ద్వారా మానసిక, ఆరోగ్య పరమైన కౌన్సిలింగ్, సుఖ వ్యాధుల పట్ల అవగాహన, చికిత్సకు సంబంధించిన సమస్యల గురించి సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగు తుందన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డాక్టర్ టి మదన్ మోహన్ రావు, పిఓడిటిటి డాక్టర్ కే లలితాదేవి, డిటిసిఓ డాక్టర్ హిమబిందు, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఇఫ్తాదర్ అహ్మద్, డాక్టర్ మంజుల, డాప్కో జిల్లా మేనేజర్ స్వప్న మాధురి, సంపూర్ణ సురక్ష కేంద్ర మేనేజర్ ఇక్బాల్ పాషా,డెమో వి అశోక్ రెడ్డి, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాస్, డాప్కోనుండి రామకృష్ణ , ఐసిటిసి కౌన్సిలర్ సురేష్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.





