Saturday, March 14, 2026

ప్రశాంతంగా ప్రజాపాలన వార్డ్ సభలు

  • కొన్ని ప్రాంతాల్లో అనర్హులతో లబ్ధిదారుల లిస్టు

నేటి సాక్షి, చేర్యాల్ : జనవరి 22 తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డ్ సభలలో రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఈ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు చేర్యాల పట్టణ పరిధిలోని పలు వార్డులో ప్రజా పాలన వార్డు సభలు నిర్వహించారు. వార్డ్ సభల్లో ప్రజలు తమ సమస్యలపై అధికారులకు చెప్పుకొచ్చారు. పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల లిస్టులో తమ పేర్లు లేకపోవడంపై ప్రజలు అధికారులను నిలదీశారు.కొన్ని ప్రాంతాల్లో కొత్త రేషన్‌కార్డుల కోసం అధికారులను ప్రజలు నిలదీశారు. దరఖాస్తులు తీసుకువెళ్తున్నారు కానీ, రేషన్‌ కార్డులను జారీ చేయడం లేదని, గతంలోనూ దరఖాస్తులు చేసుకున్నా ఫలితం లేకుండాపోతోందని అన్నారు. ప్రతి వార్డ్ పరిధిలో సభలను నిర్వహిస్తున్నారు. జాబితాలో పేర్లు రానివారికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అనర్హులతో లబ్ధిదారుల లిస్టును రూపొందించారని ప్రజలు ఆందోళన తెలి పారు. పథకాలకు అర్హుల లిస్టును వార్డు సభల్లో ప్రజలకు అధికారులు చదివి వినిపించారు. వార్డ్ సభల్లో వచ్చే దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని, అధికారులు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వరూపారాణి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ కుమార్ రెడ్డి మరియు అధికారులు మున్సిపల్ కమిషనర్ నాగేందర్ సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కృష్ణ, వార్డ్ అధికారి, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News