- రీవెరిఫికేషన్ పై హైకోర్టుకు వెళ్లనున్న వైసీపీ
నేటి సాక్షి పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : కూటమి సర్కార్ 2024 అధికారంలోకి వచ్చాక పెన్షన్ 3వేల నుంచి 4వేలకు పెన్షన్ల మొత్తాన్ని పెంచినా వాటిలో కోతలు విధిస్తోంది. తాజాగా దివ్యాంగుల పెన్షన్ల ఏరివేతకు ఆదేశాలు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లోనే లక్షల పెన్షన్లు తొలగించారని ఆరోపించారు. రాజకీయ కక్షతో పెన్షన్లు తొలగిస్తే ఊరుకోబోమన్నారు. హైకోర్టును, అవసరమైతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని వైసీపీ నాయకులు హెచ్చరించారు. రీవెరిఫికేషన్ పేరుతో వైద్య బృందాలను ఇంటింటికీ పంపి పింఛన్ లబ్దిదారుల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ నాయకులు మండిపడ్డారు.

