- ఒక కాలు కాంగ్రస్ లో మరొక కాలు బి.ఆర్.ఎస్ లో
- బి.సి నేతలను ఎదగనివ్వకుండా కుట్రల రాజకీయం
- ఈ ఎమ్మెల్యే ఎటువైపో తలపట్టుకుంటున్న జనం
- ప్రజాస్వామ్యానికి చీకటి రోజులని మేధావుల సంఘం
నేటి సాక్షి, ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల ఎమ్మెల్యే బి.ఆర్‌ఎస్ పార్టీ బిఫాం మీద గెలిచి తదనంతరం తమ సొంత కార్యకర్తల చేత వినతిపత్రాలు ఇప్పించుకొని గద్వాల అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నానని ప్రగల్భాలు పలికి కాంగ్రెస్ మంత్రులతో ములాఖాత్ లు నిర్వహించి చివరికీ సిఎల్పీ మీటింగ్ కు హాజరై ఇప్పుడు సుప్రీంకోర్టు లో పార్టీ ఫిరాయింపుల కేసు తుది దశకు చేరుకున్న తరుణంలో డ్రామా ఆడుతున్నాడు. రాజ్యాంగంలో 52 వ రాజ్యాంగ సవరణ 1985 చట్టంలో భాగంగా ఒక పార్టీలో గెలిచిన సభ్యుడు మరొక పార్టీలోకి వెళ్లకుడదనే నిబందన ఉంది.ఆ పార్టీ ఫిరాయింపుల చట్టం వలన ఉచ్చు మెడకు చిక్కుకున్నందుకు ఇప్పుడు కపట రాజకీయం చేస్తూ స్థానికంగా ఎదిగే దశలో ఉన్న బిసివాదానికి బిసి నాయకులను ఎదగనివ్వకుండా నాటకీయమైన రాజకీయాలు చేస్తూ ఈ ప్రాంత ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ఎమ్మెల్యే ఇట్లా దిగజారడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజులన్ని ఉద్యమకారులు, మేధావులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సభ్యత్వాన్ని ఇటు కాంగ్రెస్ అటు బి.ఆర్.ఎస్ పార్టీలు రద్దు చేసి ఉప ఎన్నికలు నిర్వహించి గద్వాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కవి రచయిత అవనిశ్రీ డిమాండ్ చేశాడు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సంఘాల నాయకులు జమ్మిచేడు కార్తీక్,హరిష్,నాగన్న,హాలిమ్ పాషా,వామన్ పల్లి రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.




