- బిఆర్ యస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ (కోక్కుల వంశీ) : కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రజలు ఇబ్బందులు బిఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహ రావు అన్నారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలోని ఫంక్షన్ హాల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా, ఈ సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహ రావు హాజరై మాట్లాడుతూ… గడిచిన ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని, గడిచిన కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో ప్రజలు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు ఇచ్చే రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల పనిచేసి బిఆర్ఎస్ బలాన్ని బలగాన్ని చూపించాలన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు గోసుకుల రవి, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ ఏనుగు తిరుపతిరెడ్డి, సీనియర్ నాయకులు ఏస తిరుపతి, గడ్డం హనుమాన్లు, తాజా మాజీ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





