నేటి సాక్షి చేర్యాల: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు చేర్యాల సీఐ ఎల్. శ్రీను,ఎస్ నీరేష్ లు తెలిపారు. వివరాల్లోకి వెళితే సీఐ,ఎస్ తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు చేర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ వెనక భాగంలో ముగ్గురు వ్యక్తులు కలిసి గంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో తమ సిబ్బందితో కలిసి వెళ్లగా అక్కడ అనుమానితంగా ఉన్న ముగ్గురు వ్యక్తుల వద్ద ఉన్న 198 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం , మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమంగా గంజాయిని విక్రయించినా, నిల్వ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల ప్రొబిషనరీ ఎస్ఐ. మానస రెడ్డి తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




