నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హనుమకొండ జిల్లా, హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామంలో కుక్కల దాడిలో చిర్ర అండమ్మ వృద్ధ ఒంటరి మహిళ తీవ్రంగా గాయపడి హాస్పటల్ పాలు కావడం జరిగింది గతంలో కూడా కుక్కల దాడిలో పలు వ్యక్తులు గాయపడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనలను చూసి ప్రజలు తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నారు ప్రభుత్వ అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు ఈ సమస్యలకు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని మరియు కుక్కల దాడిలో తీవ్ర గాయాల పాలైన ఒంటరి వృద్ధ మహిళ అండమ్మ కు ప్రభుత్వ అధికారులు అండగా నిలవాలని గ్రామ ప్రజలు కోరారు.





