- పట్టణ మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం
నేటి సాక్షి, మందమర్రి:- వింత వ్యాధితో కాలనీలలో బీభత్సం సృష్టిస్తున్న శునకాల నుండి ప్రజలకు రక్షణ కల్పించాలని బుధవారం సదా సేవా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సంగి సంతోష్ పట్టణ మున్సిపల్ కమీషనర్ రాయలింగు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంగి సంతోష్ మాట్లాడుతూ, శునకాల నుండి ప్రజలకు రక్షణ కల్పించాలని, శునకాలను అదుపులో తీసుకొని వాటిని సుదూర ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సదా సేవా ఆర్గనైజేషన్ సభ్యులు యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.





