Sunday, March 29, 2026

పోలీసులు ఉన్నారనే ధైర్యాన్ని ప్రజలకు కలిగించాలి

  • వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : పోలీసులు ఉన్నారు మనకు సాయం చేస్తారనే ధైర్యాన్ని ప్రజలకు కలిగించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ సిబ్బందికి సూచించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పెట్రొకార్‌, ఇంటర్‌ సెప్టార్‌కార్‌, హైవే పెట్రోలింగ్‌ విధులు పోలీస్‌ సిబ్బందితో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయము లో సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో ముందుగా సిబ్బంది ఏ విధమైన విధులు నిర్వహిస్తున్నారని పోలీస్‌ కమిషనర్‌ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఫిర్యాదు వచ్చిన వెంటనే సిబ్బంది స్పందించి ఫిర్యాదు వద్దకు చేరుకోని వారి సమస్యను అడిగి తెలుసుకొని పరిష్కరించడం లేదా పోలీసు స్టేషన్‌ అధికారి దృష్టికి తీసుక వెళ్ళడం చేయాలని, ప్రధానంగా పెట్రొలింగ్‌ నిర్వహించే సిబ్బంది విజుబుల్‌ పోలీసింగ్‌ లో భాగంగా నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలని, ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ అధికంగా చేయాలని, నేరం జరిగిన తరువాత పోలీసులు వెళ్ళేదాని కన్నా నేరం జరగకుండా చేయడం మంచిదని, ఇది దృష్టిలో పెట్టుకొని పెట్రోలింగ్‌ విధులు నిర్వహించాలని, అలాగే రాత్రి సమయాల్లో ప్రజలు మనపై వున్న నమ్మకానికి తగ్గట్లుగా పెట్రొలింగ్‌ చేసి చోరీల ను నియంత్రించాలని, పెట్రో సిబ్బంది పెట్రోలింగ్‌ మాత్రమే కాకుండా ఎదైనా ట్రాఫిక్‌ సమస్య వచ్చినప్పుడు కూడా వేంటనే స్పందించి ట్రాఫిక్‌ క్రమ బద్దీకరించాలని. ఫిర్యాదు దారుల మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తూ తెలంగాణ పోలీస్‌ శాఖ కీర్తి ప్రతిష్టలు పెంచాలని పోలీస్‌ కమిషనర్‌ సూచించారు. ఈ సమావేశంలో అదనపు డిసిపి రవి, పోలీస్‌ కంట్రోల్‌ రూం ఇన్స్‌స్పెక్టర్‌ విశ్వేశ్వర్‌, ఐటీకోర్‌ ఇన్స్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గోన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News