Saturday, March 14, 2026

మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాా

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : మోసపూరిత వాగ్దానాలు ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీముల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్త పోకడలతో ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకునేందుకు సైబర్ కొత్త పంతాలను ప్రయోగిస్తున్నారు ఇందులో భాగంగానే మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీములతో పాటు పిరమిడ్ లాంటి స్కీముల ద్వారా ప్రజల నుండి డబ్బులతో చేస్తున్నారు ఈ స్కీముల ప్రధాన లక్ష్యం విలాస వంతమైన వస్తువులు అందజేస్తామని సొంత ఇంటి కలను నెరవేరుస్తామని విదేశీ యాత్రలకు పంపిస్తామని మోసపూరితమైన వాగ్దానాలతో ఈ స్కీం లను నిర్వహిస్తున్న సైబర్ నేరగాళ్లు మొదటగా కొత్త రుసుము తో ప్రాథమిక పత్రాన్ని సభ్యత్వాన్ని కల్పించడం జరిగింది. సభ్యత్వం పొందిన వారితో మరి కొంతమంది వ్యక్తులను సభ్యత్వం కల్పించే ఎక్కువ మొత్తం పెట్టిన పెట్టుబడికి రెట్టింపు వస్తుందని ఎక్కువ మొత్తంలో సభ్యులను సభ్యులుగా చేర్పిస్తే పెద్ద మొత్తంగా డబ్బు వస్తుందని ప్రజలను మభ్య పెడుతూ కోట్లల్లో డబ్బు కొల్లగొట్టడం ఈ మల్టీ లెవెల్ స్కీముల ప్రధాన లక్ష్యమని ప్రజలు ముందుగా ఇది గుర్తించాలి ముఖ్యంగా సైబర్ నెరగాళ్ళు ప్రజల అత్యాశను తమ ఆయుధాలుగా మార్చుకొని సామాజిక మాధ్యమాలు మెయిల్స్ ద్వారా ఇతర ప్రచార సాధనాల ద్వారా ప్రజల బలహీనతలను లక్ష్యంగా చేసుకొని ప్రజల దృష్టిని ఆకర్షించే రీతిలో ప్రకటనలు పట్ల అ ప్రజలు మోసపోవద్దని ఇలాంటి స్కీముల పట్ల నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఎవరైనా ఇలాంటి స్కీముల ద్వారా మోసపోయినట్లుగా భావిస్తే తక్షణమే 193 0 టోల్ ఫ్రీ నెంబర్ గాని https://www.cybercrime.gov.inవెబ్సైట్లో కాని సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అలాగే సైబర్ నేరాల బారిన పడిన బాధితులు కమిషనరేట్ పరిధిలో సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో నైనా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News