- మున్సిపల్ అభివృద్ధికి పాలకవర్గ సభ్యుల కృషి భేష్
- చేర్యాలలో ఒక మంచి రాజకీయం ఉంది
- కులమతాలకు ఆతీతంగా వైద్యసేవలు అందిస్తున్నా
- ఏ సమస్య కోసం వచ్చిన పార్టీలకు అతీతంగా కృషి చేస్త
- వీడ్కోలు సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పల్లా గారు
నేటి సాక్షి చేర్యాల : చేర్యాల మున్సిపల్ కౌన్సిలర్లు ఐదేళ్ల పాలన గడువును ముగించుకున్నా సందర్భంగ వీరభద్ర ఫంక్షన్ హాల్ లో సోమవారం ఏర్పాటు చేసిన వీడ్కో లు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యా రు. ముందుగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజ లకు తమ వంతు సహాయ సహకారాలు అందించినందు కు ఛైర్మన్, కౌన్సిలర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.నాకొచ్చిన నిధుల నుంచి గ్రామాలు, పట్టణాలలో పార్టీలకు అతీతంగా అభివృద్ధికి పనిచేశాను.గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపాలిటీలను అభి వృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు.చేర్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.10కోట్లు నిధులు మంజూరు. చేర్యాలలో ఒక మంచి రాజకీయం ఉంది. ఎన్నికల వరకు రాజకీయం.మిగితా సమయంలో అందరం కలిసి ఉంటాం.ఏ సమస్య కోసం వచ్చిన పార్టీలకు అతీతంగా కృషి చేస్తాను.మున్సిపాలిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు ఐదేళ్లుగా నిరంతరం కృషి చేశారు.
పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవలో నిరంతరం కృషి చేసే వారికి ఎప్పుడు గుర్తింపు లభించి తగిన పదవులు వరిస్తాయి.రాబోయే కాలంలో ప్రజాసేవలో ఉంటూ మరెన్నో పదవులు సాధించాలని కోరుకుంటున్నా. అనంతరం ఒక్కొక్కరు కౌన్సిలర్ కు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఐదేళ్ల కాలంలో ప్రజలకు సుపరిపాలన అందించినందుకు ఆయన వారిని అభినందించారు.కులమతాలకు ఆతీతంగా నెలకు 5నుంచి 6వేల మందికి వైద్యసేవలు అందిస్తున్నాం. భవిష్యత్ లో ఏ పార్టీతో సంబంధం లేకుండా జనగామ నియోజకవర్గ ప్రజలకు నాలుగేళ్ళు ఆరోగ్య సమస్యలను కచ్చితంగా తీరుస్తానని మాట ఇస్తున్నాను. మొట్ట మొదటి గా అసెంబ్లీలో చేర్యాల రెవిన్యూ డివిజన్ గురించి నేను మాట్లాడాను.ప్రభుత్వంలో లేకున్నా సమస్యలను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వరూప రాణి శ్రీధర్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి కౌన్సిలర్లు కోఆప్షన్ మెంబర్స్ మరియు కాంగ్రెస్ బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





