Tuesday, March 10, 2026

స్మశాన వాటికకు దారి చేయాలని తహసిల్దార్ కి వినతిపత్రం

నేటి సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (జక్కుల సందీప్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఎవరైనా చనిపోతే స్మశాన వాటికకు వెళ్ళుటకు సరైన దారి లేక నాన అవస్థలు పడుతున్నమంటూ సరైన రహదారి ఏర్పాటు చేయాలని మంగళవారం తహసిల్దార్ స్వర్ణ కు అశ్వాపురం గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో ఆ కాలనీ వాసులు మాట్లాడుతూ మండల రెవిన్యూ నక్ష్యాలో దారి ఉన్నప్పటికీ, ఆ దారి కొంతమంది చేతిలో కబ్జాకు గురికావడం వల్ల, వెళ్లే దారి సరిగ లేక ఎస్సీ కాలనీ, కాల్వ బజార్, చిన్న తండా, మల్లమ్మ సెంటర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని అన్నారు. తహసిల్దార్ సర్వేయర్ తో సర్వే చేయించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి దారి ఏర్పాటు చేయుటకు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఇసంపల్లి కృష్ణ మాదిగ, బి ఆర్ ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గద్దల రామకృష్ణ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గద్దల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News