నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): ఇబ్రహింపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన తోకల శేఖర్ S/o చిన్న రాజన్న గత సెప్టెంబర్ నెలలో కోరుట్ల బస్సు స్టాండ్ లో తన సెల్ ఫోన్ పోగొట్టుకోవడం జరిగింది. వెంటనే కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీసులు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేసి శుక్రవారం బాధితుడికి ASI Md. అలీముద్దిన్ అందజేశారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్లో సంప్రదిస్తే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చని ASI తెలిపారు.





