నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి):
కోరుట్ల మండల ఐలాపూర్ గ్రామానికి చెందిన మేనుగు లోకేష్, చల్ల రవితేజల సెల్ ఫోన్లు కోరుట్ల పట్టణంలో డిసెంబర్ 28వ తేదీన పోగొట్టుకోవడం జరిగింది. వారు కోరుట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్లను రికవరీ చేసి మంగళవారం బాధితులకు ఎస్ఐ. ఎస్.శ్రీకాంత్ అందజేశారు. ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సీఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించవచ్చని కోరుట్ల ఎస్ఐ.ఎస్. శ్రీకాంత్ తెలిపారు.





