Sunday, March 22, 2026

సాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలి

  • జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వర్ధన్నపేట ఎస్సారెస్పీ ప్రధాన కాలువను అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించిన కలెక్టర్. సాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని వర్ధన్నపేట ఎస్సారెస్పీ ప్రధాన కాలువను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో నీటి లభ్యత ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సారెస్పీ ప్రధాన కాలువ ద్వారా వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లోని రావూరు, ధూప తండా, కల్లెడ పర్వతగిరి తదితర గ్రామాల లోని నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకొంటూ రైతుల పంటలు నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఇరిగేషన్ ఇంజనీర్ శంకర్ చౌహాన్ డి ఈ లు కిరణ్ కుమార్, ఎన్ రాజు, ఏఈ లు తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News