- వరంగల్ ఏసిపి మందిరం నాయక్
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వివాహ మరియు ఇతర వేడుకలలో డిజే సౌండ్స్ పెట్టే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోనీ మరియు డీజే లను సీజ్ చేస్తామని తెలిపారు. ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి మరియు ఇతర పోటి పరీక్షలు ఉన్నందున వివాహ ఊరేగింపులలో మరియు ఇతర వేడుకలలో డిజె సౌండ్స్ పెట్టి విద్యార్థులకు, వృద్ధులకు, చిన్న పిల్లలకు మరియు సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగించే సౌండ్స్ ను నడిపే ఆపరేటర్ల పై, యజమానుల పై మరియు వేడుకల కోసం డీజే సౌండ్స్ ని మాట్లాడుకునే వారిపై కేసులు నమోదు చేసి, సీజ్ చేసి, వారిని జైలు కి పంపబడును. డీజే సౌండ్స్ నిర్వాహకులు మరియు వేడుకలు జరుపుకునే వారు పై విషయమును దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వేడుకలకు సౌండ్స్ పెట్టకుండా విద్యార్థులకు, వృద్ధులకు, చిన్న పిల్లలకు మరియు సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగించ వద్దని వరంగల్ డివిజన్ పోలీస్ హెచ్చరించారు.




