నేటి సాక్షి, కోదాడ(అనంతగిరి): సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పరిధిలోని బొజ్జగూడెం తండా లో ప్రజలు డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. సమస్య ఉందని కార్యదర్శి కి కాల్ చేస్తే దానికి స్పందన కరువైంది. చరవాణి ద్వారా ఒకటి రెండు సార్లు స్పందించి ఆ పని పూర్తి చేస్తున్నమని చెప్పి సమస్యకి పరిష్కారం కరువైంది ఎక్కడ వేసిన దుంపటి అక్కడే అన్నట్లుగా ఉన్నది. కార్యదర్శి పని తీరు ప్రజలకు అందుబాటులో లేదు. అని దీని వల్ల మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, అసలే వేసవికాలం దోమలు, ఈగలు ఎక్కువయ్యి విష జ్వరాల ప్రబాలుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. వారి సమస్య పరిష్కారం పై మా మొర ఆలకించండి అని అధికారులకు ఎంపీడీవో, కలెక్టర్ లకి వారు సామాజిక మాధ్యమాల్లో విన్నవించుకున్నారు.





