నేటి సాక్షి కొడిమ్యాల : మంగళవారం సాయంత్రం సుమారు 5 గంటల ప్రాంతంలో కొరిమ్యాల మండలం గౌరాపూర్ గ్రామ శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం అందగా స్థానిక ఎస్సైతన సిబ్బందితో పేకాట రాయుళ్ల స్థావరానికి వెళ్లగా అక్కడ ఎనిమిది మంది పేకాట ఆడుతూ కనిపించారు అందులో ఐదుగురు వ్యక్తులు అరెస్ట్ అవ్వగా మిగతా ముగ్గురు వ్యక్తులు తప్పించుకున్నారు. పేకాట ఆడిన వ్యక్తుల వివరాలు శ్రీపతి హరి, పత్తిపాక స్వామి, గరిగంటి మల్లేశం, గరిగంటి చంద్ర వాసు, చెవిటి గోవిందు, జీవన్ రెడ్డి, మంగలి వెంకటేష్. సాలె శ్రీను. అనె వ్యక్తుల వద్ద నుండి 16,950 రూపాయలు లభించగా అట్టి డబ్బులను గౌరవ పంచుల సమక్షంలో సీజ్ చేసి కొడిమ్యాల ఎస్ఐ సందీప్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినారు.




