
నేటిసాక్షి, జమ్మికుంట:
గురువారం రోజున జమ్మికుంటలోని బిర్యాని సెంటర్లు, మెస్ లు, హోటల్ ల నిర్వాహకులను పోలిస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తమ హోటల్ లలో, షాపులలో ఎలాంటి లిక్కర్ విక్రయాలు జరుపరాదని, బయటినుండి లిక్కర్ ను అనుమతించ వద్దని, సిట్టింగులు పెట్టకుండా చూసుకోవాలన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. రాత్రి 10:00 గంటలకు మించి షాపులు ఓపెన్ చేసి ఉంచకూడదని తెలిపారు. అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.





