- నిందితుని నుండి 5,05,100/- రూపాయల విలువ గల 10 కిలోల 102 గ్రాముల గంజాయి మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం
నేటి సాక్షి, మహబూబాబా ద్ నరసింహుల పేట భూక్యా రవి : తేదీ 06.03.2025 రోజున మధ్యాహ్నం 03:30 గంటలకు పై అధికారుల ఆదేశాల మేరకు శనగపురం రోడ్డులోని బాలాజీ గార్డెన్ క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా ఒక మగ వ్యక్తి ఒక బ్యాగ్ తో ఉండి అనుమానాస్పదంగా పారిపోతుండగా అతనిని పట్టుకొని ఎందుకు పారిపోతున్నావని అడగగా అతను భయపడుతూ సరియైన సమాధానం చెప్పకపోవడంతో వెంటనే ఇద్దరు పంచుల సమక్షంలో అతనిని విచారించగా తన పేరు 1) బరున బరడ్ తండ్రి పేరు సంతోష్ బరడ్, వయసు: 25 సంవత్సరాలు, కులం బరడ్, వృత్తి: కూలి, నివాసము: బడఖరిడ, బానే మండలం, గంజాం జిల్లా, ఒడిశా రాష్ట్రం అని తెలిపి అతను సూరత్ లో కూలి పనులు చేయగా వచ్చే డబ్బులు సరిపోక పోవడంతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిస్సా నుండి గోపాల్ అనే వ్యక్తి వద్ద నుండి తక్కువ ధరకు 10.102 కేజీ ల గంజాయిని కొని దానిని సూరత్ లో అధిక ధరకు అమ్ముటకు విజయవాడ మీదుగా వెళుతుండగా మహబూబాబాద్ వద్ద ట్రైన్ లో పోలీసులు తనిఖీ చేయుచున్నారని భయపడి మహబూబాబాద్ లో ట్రైన్ దిగి తొర్రూర్ మీదుగా వరంగల్ వెళ్ళుటకు గుర్తు తెలియని ఆటో ఎక్కగా బాలాజీ గార్డెన్ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు తనకి చేయుచున్నారని ఆటో దిగి పారిపోయే ప్రయత్నం చేయగా అతని వద్ద నుండి రూరల్ SI V. దీపిక, మరియు తమ సిబ్బంది వి.అశోక్, జి. రవి, వి.ఉమ, బి.బాలరాజ్, ఎన్. లింగారావు, జి.సంతోష్ కుమార్ మరియు జి. కిషన్ అను వారుపై నిందితుడిని రూరల్ పిఎస్ కు తీసుకుని రాగా ఏఎస్ఐ జాకీర్ గారు నిందితునిపై కేసు నమోదు చేయనైనది. పై నిందితుని వద్దనుండి 10 కేజీల 102 గ్రాముల గంజాయి మరియు ఒక మొబైల్ ఫోన్ స్వాధీన పరచుకోనైనది. రూరల్ సీఐ పి.సర్వయ్య గారు నిందితుడిని రిమాండ్ కు పంపనైనది. చాకచక్యంగా వ్యవహరించి గంజాయిని పట్టుకున్న రూరల్ సీఐ పి. సర్వయ్య గారిని, రూరల్ ఎస్ఐఐ దీపిక మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అభినందించినారు.



