నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : రామగుండం సిపిగా పనిచేసి సిఐడి విభాగానికి బదిలీపై వెళ్తున్న ఎమ్. శ్రీనివాస్ కు పోలీసు అధికారులు సిబ్బంది ఘనంగా సోమవారం కమిషనరేట్ ఆవరణలో సోమవారం వీడ్కోలు పలికారు. పోలీస్ కమీషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమంలో జరిగిన కార్యక్రమములో బదిలీ పై వెళ్తున్న ఎం. శ్రీనివాస్ కి పోలీసుల గౌరవ వందనాలు సమర్పించారు. ముందుగా గజమాలతో సత్కరించి వాహనంలో సీపీ ని హెడ్ క్వార్టర్స్ గేట్ వరకు కమీషనరేట్ పోలీసు అధికారులందరూ సిబ్బంది వాహనం కు ఏర్పాటు చేసిన తాడును లాగి సాదరంగా వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా బదిలీ పై వెళ్తున్న సీపీ మాట్లాడుతూ… రామగుండం పోలీస్ కమీషనరేట్ లో పని చేసిన సమయం, చేసిన కార్యక్రమాలు మరువలేనివని ఎంతో తృప్తి నీ ఇచ్చాయని తెలియజేశారు. దాదాపు 13 నెలలపాటు చేసిన సమయంలో సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందికి సీపీఓ సిబ్బందికి ప్రతి ఒక్కరికి సీపీ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కష్టపడుతూ అందరి సమన్వయము తో పార్లమెంటు ఎన్నికలను, వి వి వి పిల కార్యక్రమాలు, పోటీ పరీక్షలు మరియు పండుగలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ లో పని చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. ఇక్కడి ఆఫీసర్లు, సిబ్బంది సమస్వయం, ఒక టీమ్ లాగా అందరూ కలిసి కట్టుగా పని చేయడం బాగుందన్నారు.



