పట్టుబడ్డ ప్రబుద్దులు
నేటి సాక్షి, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శుక్రవారం రోజు సాయంత్రం సుమారు 7.30 గం. ల సమయం లో లక్ష్మిపురం గ్రామ శివారు లో టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట శిబిరం పై దాడి చేసి 7 గురు వ్యక్తులైన లక్కం రాజేందర్ పరకాల, గట్ల మల్లేశం శనిగరం, బోయిని రాజేష్ పరకాల, అవునూరి రాజకుమార్ గూడూరు, బండి కుమారస్వామి శనిగరం, బొమ్మకంటి సుదీర్ పరకాల, అవనిగంటి హిమావంత్ పరకాల వారిని అదుపులో లో తీసుకొని వారి వద్ద నుండి 54400/-, 52 ప్లేయింగ్ కార్డ్స్, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేయటం జరిగిందని సీఐ ఈ.హరికృష్ణ తెలిపారు. పేకాట, ఆల్కహాల్, డ్రగ్స్ కు బానిస కాకుండా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పట్టుబడ్డ వ్యక్తులపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా సిఐ హరికృష్ణ పలు సూచనలు చేశారు.

