Monday, March 23, 2026

రాజన్న ఆలయం పై మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు వ్యక్తిపై కేసు, రిమాండ్ కి తరలించిన పోలీసుల

  • సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా
  • జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ దేవస్థానంకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్ లు చేస్తున్న షామీర్ పెట్, మేడ్చెల్ ,మల్కాజిగిరి కి చెందిన నూనెముంతల రవీందర్ గౌడ్ తండ్రి అంజనేయులు, వయస్సు 43 సం అనే వ్యక్తి పై వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్ కి తరలించడం జరిగిందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని,జిల్లా పరిధిలో సామాజిక మాధ్యమాలు అయిన ఫెస్ బుక్ , ట్విట్టర్,ఇంస్టాగ్రామ్, వాట్సప్ గ్రూప్స్, తదితర గ్రూప్ లలో ఒక వర్గాన్ని కానీ ఒక మతాన్ని కానీ కించపరిచేలా, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం,విద్వేషాన్ని దుష్ప్రచారం చేయడం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధమైన పోస్టులు పెట్టిన,వ్యాప్తి చేసిన ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News