
నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) :
వరంగల్ పోలీస్ కమిషనరేట్ మోడల్ వార్షిక గేమ్స్ స్పోర్ట్స్ మీట్ రేపటి నుండి ప్రారంభం కానుంది ఉదయం 10 గంటలకు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభం అవుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఒక ప్రకటనలో తెలిపారు. రేపటి నుండి మూడు రోజుల పాటు జరిగే ఈ పోలీస్ క్రీడల్లో సెంట్రల్ జోన్ వెస్ట్ జోన్ ఈస్ట్ జోన్ తో పాటు పోలీస్ అనుబంధ విభాగాలు ఆర్ముడ్ రిజర్వు విభాగాలకు పోలీస్ క్రీడాకారులు 12 క్రీడాంశాలలో పోటీ పడతారని ఈ పోటీల్లో విజేతలు నిలిచిన పోలీస్ క్రీడాకారులకు క్రీడల ముగింపు రోజున బహుమతి ప్రధానం చేయడంతో పాటు వచ్చే నెలలో కరీంనగర్లో నిర్వహించబడే రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ క్రీడా పోటీలను అత్యధిక సంఖ్యలో ప్రజలు తిలకించి పోలీస్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఈ క్రీడలను విజయవంతం చేయాల్సిందిగా పోలీస్ కమిషనర్ కోరారు.





