Thursday, March 26, 2026

నేర నిందితులను పట్టుకొవడం లో పోలీస్‌ జాగిలం కీలకం

  • వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : నేరాలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం పోలీసు జాగిలాలు కీలకంగా నిలుస్తున్నాయని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కు నూతనంగా వచ్చిన పోలీస్‌ జాగిలాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ మంగళవారం పరిశీలించారు. గత 28వ తేదిన మొయినాబాద్‌ లోని పోలీస్‌ జాగిలాల శిక్షణా కేంద్రంలో ఎనిమిది నెలల శిక్షణను పూర్తి చేసుకోని వచ్చిన ఐదు పోలీస్‌ జాగిలాలు వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ డాగ్‌ స్వ్కాడ్‌ లో చేరి విధులు నిర్వహించేందుకు సిద్దమయినాయి. ప్రేలుడు పదార్థాలను పసిగట్టే ఈ ఐదు జాగిలాల్లో మూడు బెల్జియన్‌ మాలినోస్‌, రెండు గొల్డెన్‌ రీట్రీవర్‌ జాతులకు చెందిన జాగిలాలు, వీటికి రానా, జానీ, డయానా, మాక్స్‌, కైరో గా నామకరణం చేయడం జరిగింది. నూతనంగా వచ్చిన ఈ జాగిలాలను సంబంధించిన పూర్తి వివరాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌కు హ్యాండ్లర్లు వివరించారు. గతంలోని జాగిలాలు ఎన్నో ప్రేలుడు పదార్థాలను పసి గట్టడం లో విజయం సాధించాయని ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ గుర్తు చేసారు. నూతనంగా వచ్చిన జాగిలాలకు మెరుగైన వసతిని ఏర్పాటు చేయాల్సిందిగా సిపి సంబంధిత అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి సురేష్‌ కుమార్‌, ఆర్‌.ఐ శ్రీనివాస్‌, డాగ్‌ స్వ్కాడ్‌ ఇంచార్జ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రభాకర్‌తో పాటు హ్యాండ్లర్లు రాజేష్‌ కుమార్‌, వెంకన్య, సురేష్‌, దిలిప్‌ లు పాల్గోన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News