- ఘనంగా కాన్సీరామ్ జయంతి వేడుకలు

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
దేశ రాజకీయాల్లో రాజకీయ రసాయన శాస్త్రజ్ఞుడు కాన్సీరామ్ అని బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లా కేంద్రంలో శనివారం బిఎస్పీ వ్యవస్థాపకుడు కాన్సీరామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టి, వేడుకలు నిర్వహించారు. అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, కాన్షీరాం బహుజనులకు చేసిన సేవలను కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యం అని, తన సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుడు కాన్షీరామ్ అని తెలిపారు. దేశ రాజకీయాల్లో సామాన్యుడు సైకిల్ పై బయలుదేరి, విజయతీరాన్ని చేరుకున్నాడని, చరిత్ర మరిచిన బహుజన మహనీయులందరినీ దేశానికి, ప్రపంచానికి పరిచయం చేసింది కాన్సీరామ్ అని తెలిపారు. ఆయన ఆశయ సాధనతో పార్టీని జిల్లాలో గ్రామ గ్రామానికి తీసుకువెళ్తామని, రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో లక్ష్యాన్ని చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు దాగం శ్రీనివాస్, మందమర్రి పట్టణ అధ్యక్షుడు గాజుల శంకర్, మంచిర్యాల పట్టణ నాయకులు మడిపల్లి రాములు, జిల్లా నాయకులు చెన్నూరి రాజు, కుమ్మరి కృష్ణ చైతన్య, సుందిళ్ల అశోక్, బేడ్డల రవి లు పాల్గొన్నారు.





