
నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, రేపాల గ్రామ ముద్దుబిడ్డ, సామాజిక ఉద్యమకారుడు పొనుగోటి రంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ. తెలంగాణ ఉద్యమకారుడిగా, సామాజిక ఉద్యమాలు, దైవభక్తి, విద్యార్థుల సమస్యలు, జర్నలిస్టుగా పొనుగోటి రంగా చేసిన సేవలను గుర్తించి సూర్యాపేట జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా నియమించినట్లు ఆయన తెలిపారు. పొనుగోటి రంగా మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ఆర్.కృష్ణయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లాలో బీసీల అందరిని ఐక్యం చేసుకొని బీసీల సంక్షేమానికి ఉద్యమిస్తానన్నారు. నాపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీసీల సంక్షేమమే లక్ష్యంగా పోరాటం చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లుట్ల శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ వీరబోయిన లింగయ్య యాదవ్, బిసి యువజన సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు గడ్డం లక్ష్మీనారాయణ యాదవ్, బీసీ నాయకులు రాజేష్, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

