Thursday, March 19, 2026

అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం సాధించిన నిరుపేద బిడ్డ

  • కావ్యను ఘన సన్మానం చేసిన
  • అంతర్జాతీయ క్రీడాకారులు ప్రభు

నేటి సాక్షి, జమ్మికుంట : ఆదివారం హైదరాబాద్ ఎల్బీనగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన మార్షల్ ఇంటర్నేషనల్ కరెక్ట్ ఛాంపియన్షిప్ పోటీలలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి సుమారు మూడు వేల మంది కరాటే విద్యార్థులు పాల్గొనగా జన్ను కావ్య 15 -17 విభాగంలో అత్యధిక ప్రతిభను కనబరిచి అంతర్జాతీయ పోటీలలో కటాస్ లో బంగారు పతకం సాధించి ఈ గడ్డకు గొప్ప పేరు తీసుకొచ్చారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మారుతి నగర్ కు చెందిన జన్ను రమేష్ కుమార్తె జన్ను కావ్య జమ్మికుంట లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతూ హుజురాబాద్ కు చెందిన గ్లోబల్ శోటాకాన్ కరాటే డూ ఇండియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్కే జలీల్ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేక శిక్షణ పొంది ప్రతి పోటీలలో అత్యంత ప్రతిభను కనబరుస్తూ పతకాలు సాధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ క్రీడాకారులు అంబాల ప్రభాకర్ (ప్రభు) జమ్మికుంటలోని తన ప్రభు ఆర్ట్స్ గ్యాలరీలో కావ్య ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తూ అంతర్జాతీయ కరాటే పోటీలలో బంగారు పతకమే సాధించడమే కాకుండా ఒలంపిక్స్ లో పథకాలు సాధించాలని అన్నారు. అదేవిధంగా ఆడపిల్ల అయినా తన కూతురు కావ్యను చదువుతో పాటు క్రీడల్లో, కరాటే రంగాలను ప్రోత్సహించిన తన తండ్రి రమేష్ ను, ప్రత్యేక కరాటే శిక్షణను ఇచ్చిన ఎస్కే జలీల్ ను అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News