- సంచార జాతులుగా నివసిస్తున్న కుమ్మరి కులం వారిని ఎస్టీలుగా ప్రకటించాలి
- విద్యారంగపరంగా విద్యార్థుల విద్యార్థులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
- సంచార జాతులుగా నివసిస్తున్న కుమ్మర్ల మీద దాడులను అరికట్టాలి
- విద్యారంగపరంగా వెనకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక చేయూత ఇవ్వాలి
- కుమ్మరి వృత్తికి ప్రత్యేక నిధులు కేటాయించాలి
- కుమ్మరి (శాలివాహన )జిల్లా నాయకులు కొలిచలం శ్రీనివాసరావు
నేటి సాక్షి, కోదాడ ప్రతినిధి: ఆర్థికంగా విద్యారంగపరంగా వెనకబడ్డ కుమ్మరి కులాన్ని బిసి బి నుండి ఎస్టీ జాబితా కి మార్చాలని సూర్యాపేట జిల్లా కుమ్మరి (శాలివాహన) నాయకులు కొలిచలం శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కుమ్మరి కులాన్ని కేంద్ర ప్రభుత్వం గానీ రాష్ట్ర ప్రభుత్వాలు గానీ పట్టించుకోకపోవడంతో సంచారం జాతర నివసిస్తున్న కుమ్మరులు ఆర్థికపరంగా విద్యారంగపరంగా రాజకీయంగా బాగా చితికిపోయి ఉన్నారు. మట్టి నమ్ముకుని పనిచేస్తున్న కుమ్మరి కులాన్ని అవహేళన చేస్తూ కుమ్మరి వృత్తిని అవమానిస్తున్నారు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న కుమ్మర్లును కులం పేరుతో దూషిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ కులాన్ని అవహేళన చేస్తూ ఆనందం పొందుతున్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మాకు దక్కింది. అవహేళన మాత్రమే మట్టిని కుండగా మార్చే నైపుణ్యం కొన్ని వందల వేల క్రితమే నాగరికత నేర్పిన కులం మాది కొన్ని వందల వేల క్రితం మట్టికుండ లేనిదే మనుగడ లేదు అలాంటి గొప్ప సంస్కృతి కుమ్మరి సంస్కృతి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆర్థికంగా రాజకీయంగా విద్యారంగపరంగా వృత్తిపరంగా నష్టపోయిన కుమ్మరి కులాన్ని ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సంచార జాతులుగా ఉన్న కుమ్మరి వారిని ఎస్టీ జాబితాలోనికి మార్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నాము.





