నేటి సాక్షి, మెట్ పల్లి : దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా విద్యుత్ అధికారులు పెంబట్ల-కోనాపూర్ 220/132 కెవి సబ్ స్టేషన్ లో చేపడుతున్న లైన్-ఇన్, లైన్-ఔట్ టవర్ల నిర్మాణ పనుల ముగింపులో బాగంగా మెట్ పల్లి డివిజన్ పరిధిలో ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని మెట్ పల్లి డీఈ గంగారాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా 132/33కెవి సబ్ స్టేషన్ గోదూరు, కోరుట్ల, కథలాపూర్ పరిధిలో ఉన్న ఏడు గ్రామీణ మండలాల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సింగిల్ ఫేజ్ సరఫరా మాత్రమే కొనసాగించబడుతుందని, రెండు మున్సిపాలిటీ లలో యధావిధంగా త్రీ ఫేజ్ విద్యుత్ ఉంటుందని తెలిపారు. రైతులు వరినాట్ల కొరకు శనివారం రాత్రి త్రీ ఫేజ్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతున్నామని, నీరు పొలాల్లో సమృద్ధిగా ఉంచుకోవాల్సిందిగా ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగిందని. కావున రైతులు, వినియోగదారులు సహకరించాలని కోరారు.





