నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏ డీ అశోక్ తెలిపారు. నాగారం, మల్లారెడ్డి పల్లి, చింత గట్టు, జయగిరి సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు ఉదయం 11 నుండి 12 గంటల వరకు విద్యుత్ మరమ్మత్తుల దృష్ట్యా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. దీనికి వినియోగ దారులు సహకరించాలని కోరారు.



