నేటి సాక్షి, కన్నెపల్లి : వేమనపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కన్నెపల్లి మండలంలోని లింగాల గ్రామానికి చెందిన దందేర భాస్కర్ కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన చెక్కును అందజేశారు.భాస్కర్ బ్యాంకులో రూ.436 కట్టి పిఎంజెజెబివై పాలసీ చేసుకోవడం జరిగిందని అతను కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం వలన అతని నామిని సాలక్కకు రూ.2లక్షల చెక్కును అందించారు.అనంతరం వారు మాట్లాడుతూ బ్యాంకులో ప్రతి ఖాతాదారుడు ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన,సురక్ష బీమా యోజన,అటల్ పింఛన్ యోజన అందుబాటులో ఉన్నాయని వివరించి ఇట్టి సేవలు వినియోగించుకోవాలని ఖాతాదారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ వరుణ్,ఐరిక్స్ ఛానల్ మేనేజర్ గణేష్,సిఎస్పీలు కీర్తి రవి,నాగుల మారుతి ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.



