నేటి సాక్షి అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాధర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రాయచోటి నియోజకవర్గం టిడిపి నాయకులు డా. లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాయచోటి నియోజకవర్గం టిడిపి నాయకులు డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాయచోటి నియోజకవర్గంలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని భూ సమస్యల పరిష్కారానికి ప్రజాధర్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన రామాపురం మండలం సరస్వతి పల్లి గ్రామం చెందిన సర్పంచ్ మునీర్ భాష టిడిపి నాయకుడు కదిరిప్ప నాయుడు సీనియర్ నాయకుడు టిడిపి అన్నయ్య అందరూ కలిసి వెళ్లడం జరిగింది.

