Saturday, March 21, 2026

పతాక స్థాయిలో ప్రసన్న హరికృష్ణ టీం సభ్యుల ప్రచారం

నేటి సాక్షి, హుజూరాబాద్, ఆర్.సి (రాఘవుల శ్రీనివాసు):
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో మంగళవారం రోజున స్థానిక హై స్కూల్ గ్రౌండ్ నందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ టీం సభ్యులు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ ను గెలిపించుకుంటే రాబోయే భవిష్యత్తులో విద్యార్థుల యొక్క జీవితాలలో వెలుగులు నింపగలడని టీం సభ్యులు పలువురికి తెలియజేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పార్టీలకు సంబంధించిన వ్యక్తులు నిలబడినంత మాత్రాన వారెవ్వరు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దలేరని, అందుకే మనలో ఒకడైన హరికృష్ణను గెలిపించుకుంటే భావితరాలకు బంగారు బాటలు వేయవచ్చునని టీం సభ్యులు ప్రచారంలో వివరించారు. ఎమ్మెల్సీగా గద్దెనెక్కాలని ఎంతోమంది నాయకులు ఇప్పుడిప్పుడు ప్రచారంలోకి వచ్చి ప్రజల మధ్యలో కనిపిస్తున్నారని అలాంటి మాయమాటలు నమ్మవద్దని, కేవలం నిజాయితీగా అర్థం చేసుకొని, ప్రజల పక్షాన పని చేసే నాయకుడు ప్రసన్న హరికృష్ణ ను గెలిపించుకోవాలని విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు గొడిశాల రమేష్ ఆధ్వర్యంలో మిడిదొడ్డి రమేష్, విజయ్, గా

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News